![]() |
![]() |

బుల్లితెర మీద నవ్వులు పంచే కామెడీ షోస్ అంటే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ గుర్తుకొస్తాయి. ఇక ఇప్పుడు మాస్ జాతర(Mass Jaathara) పేరుతో ఒక షో రాబోతోంది. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. బుల్లితెర కామెడీ గర్ల్స్ వచ్చి షో గురించి గొప్పగా చెప్పారు.
"హిట్ చేసే జనాలు మనస్ఫూర్తిగా నవ్వాలి. పంచ్ వేస్తే మైండ్ బ్లాక్ అవ్వాలి." అంటూ సుప్రీతా చెప్పింది. "మనం ఏం చేసినా అందరూ ఫుల్ ఎంటర్టైన్ అవ్వాలి లేకపోతే మనం జడ్జెస్ దగ్గర లాక్ అవ్వాలి." అంటూ దీపికా రంగరాజు చెప్పింది. "నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం. ఈ స్టేజ్ మీద ఆ రెండు జరగాలంటే ఒక మాష్టర్ రావాలి." అంటూ దీపికా పిల్లి చెప్పింది. వాళ్ళ మాటలకు "నేనొచ్చేశా రికార్డులు తిరగ రాస్తా."అంటూ మధ్యలో అడ్డొచ్చాడు వెంకీ మంకీ. "అరేయ్ ఆగు .. ఆయన వస్తున్నారు. మళ్ళీ రిధం మిస్ అయితే రచ్చ రచ్చ " అంటూ పవిత్ర వచ్చి వెంకీ మంకీ మీద అరిచింది.
"వస్తున్నారు వస్తున్నారు. సాలిడ్ స్టెప్స్ తో హోల్ ఇండియాని స్టెప్స్ వేయించిన వారు. హుక్ స్టెప్ తో జాతర చేసిన వారు." అంటూ చెప్పేసరికి ఇంతలో ఒక కార్ లో కొరియోగ్రాఫర్ జానీ మాష్టర్ వచ్చాడు. తన హుక్ స్టెప్ తో " టైమ్ కాదమ్మా టైమింగ్ మ్యాటర్ ఇక్కడ". అంటూ చెప్పాడు. తర్వాత కమెడియన్ కానీ సీరియస్ కమెడియన్ నవదీప్ వచ్చాడు. "కామెడీ టైమింగ్లో అస్సలు తగ్గేదేలే. ఇక మొదలెడదామా" అన్నాడు.
ఇక ఈ షో ఈనెల 14 న నుంచి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు జెమినీ టీవిలో ప్రసారం కాబోతోంది. ఇక నెటిజన్స్ ఐతే "ఈ షో యాంకర్ ఎవరు ? " మాస్ మహారాజ మూవీ టైటిల్ బీజీఎమ్ బాగుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీమ్ లీడర్స్ గురించి రీసెంట్ గా అనౌన్స్ చేశారు. పాగల్ పవిత్ర - సద్దాం , వెంకీ మంకీ-యాదమ్మ రాజు, యోద్ధ క్రాంతి - చందు ఉండబోతున్నారు.
![]() |
![]() |